
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా ఈరోజు ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 1,85,190 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరింది. ఇందులో 1,23,36,036 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనాతో 24 గంటల్లో 1026 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొతం కరోనా మరణాల సంఖ్య 1,71,929కి చేరింది.