Site icon NTV Telugu

భారత్‌ కరోనా అప్‌డేట్‌

భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 221 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,48,922 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,59,873కి పెరిగింది. మరోవైపు.. మరోవైపు వ్యాక్సినేషన్‌పై దీపావళి ప్రభావం పడింది.. నిన్న 5,65,276 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా.. మొత్తం కరోనా టీకాల సంఖ్య 1,07,70,46,116కు చేరింది.

Exit mobile version