ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. ఇందులో 3,10,99,771 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,06,822 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. దేశంలో కొత్తగా కరోనాతో 491 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 43,910 మంది కోలుకున్నారు. 24 గంటల్లో ఇండియాలో 55,91,657 మందికి టీకాలు అందించారు. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 50,68,10,492 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
