
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు 30 నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఉదృతి ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.