భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.
Read Also: భారీగా తగ్గిపోతున్న కేసులు…. త్వరలోనే అక్కడ ఆంక్షలు ఎత్తివేత
మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,73,70,971కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,23,018గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని… ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 16.16గా ఉందని కేంద్రం తెలిపింది.
