దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం 16,678 కేసులు నమోదు కాగా మంగళవారం 13,615 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 20 మంది కరోనా చనిపోయారు. కోవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23 శాతానికి తగ్గింది. సోమవారం దేశంలో 4,21,292 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Read Also: Germany: దెబ్బకొట్టిన ‘నోకియా’.. అక్కడ వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లపై నిషేధం
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,25,474 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,31,043 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 4,29,96,427 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో10,64,038 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 5,72,560 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 1,157 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
