Corona Cases: 46 వేల దిగువన కరోనా యాక్టివ్ కేసులు.. కోట్ల మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 45,749కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.10గా ఉంది.
దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,216గా ఉంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. ఇండియాలో 4,39,36,092 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,49,966 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,310 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,47,08,266కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,20,447 మంది మరణించారు. శనివారం మరో6,79,774 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,36,97,662కు చేరింది. జపాన్‌లో కొత్తగా 64,694 కేసులు వెలుగుచూశాయి. మరో 157 మందికిపైగా మరణించారు.దక్షిణ కొరియాలో 57,309 కొవిడ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి.
కొవిడ్ వ్యాప్తి మొదటి రెండేళ్లలో ఐరోపా సమాఖ్య దేశాల్లో దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలతో బాధపడినట్లు తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. డబ్ల్యూహెచ్‌ఓ కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్, ఎవల్యూషన్’ అనే సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. 2020, 2021ల్లో ఈయూ దేశాల్లో కరోనా సోకిన కొందరిలో కనీసం మూడు నెలలపాటు లాంగ్ కొవిడ్ లక్షణాలు కొనసాగాయని నివేదికలో పేర్కొంది. యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో లక్షలాది మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలతో బాధపడినట్లు డబ్ల్యూహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హెన్రీ క్లూగే సైతం ధ్రువీకరించారు.లాంగ్ కొవిడ్ లక్షణాల బారిన పడే అవకాశం పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. ఒక్కోసారి ఆసుపత్రిలో చేరేంతగా పరిస్థితులు దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?