India Corona: దేశంలో 5,476 కరోనా కేసులు.. జూన్ లో ఫోర్త్ వేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 5,476 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా వల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న కరోనా నుంచి 9,754 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,23,88,475కు పెరిగింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 178.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతూనే వుంది. చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తే కేసులు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం కోవిడ్ ముప్పు ఇంకా తగ్గిపోలేదని, మరో వేవ్ త్వరలో రాబోతుందని షాకింగ్ అంశాలు బయటపెట్టారు. కోవిడ్ 19 వరుసగా మూడు వేవ్‌లుగా ఇండియాలో విజృంభించింది. థర్డ్‌వేవ్ ప్రాణాంతకం కాకపోయినా..సెకండ్ వేవ్ మాత్రం విలవిల్లాడించింది. వేలాదిమందిని బలితీసుకుంది. థర్డ్ వేవ్ లో ప్రాణనష్టం తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్‌వేవ్ ప్రారంభమయ్యేందుకు 6 నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్‌వేవ్ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేందుకు 4-5 నెలల సమయం పట్టింది. కరోనా థర్ద్‌వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తుంటే ఇటీవల కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు జూన్‌లో ఫోర్త్ వేవ్ ప్రారంభం అవుతుందంటున్నారు.జూన్ నెలలో ప్రవేశించి..అక్టోబర్ వరకూ ఫోర్త్ వేవ్ వుండబోతుంది. అయితే, తీవ్రత గురించి అంతగా అంచనా వేయలేదు. ఈ నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ వేగవంతం అయితే తీవ్రత అంతగా వుండకపోవచ్చంటున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!