ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల్లో ఇండియాలో 57,31,574 మందికి టీకాలు అందించారు. ఇప్పటి వరకు మొత్తం 52,95,82,956 మందికి టీకాలు వేశారు.
Read: డ్రాగన్ దేశంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్…పూహాన్ తరహాలో ఇళ్లకు తాళాలు…
