Site icon NTV Telugu

ఇండియాలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి.  తాజాగా దేశంలో 2,38,018 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  నిన్న‌టి కేసుల కంటే ఈరోజు 20,071 కేస‌లు త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  310 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ప్ర‌స్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి.  రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది.  ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 8,891 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  ఒమిక్రాన్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా క‌ట్ట‌డి కోసం అనేక రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ క‌ర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  

Read: పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…

Exit mobile version