Site icon NTV Telugu

Corona Updates : కోరలు చాస్తోన్న కరోనా రక్కసి.. మళ్లీ భారీగా దేశంలో కేసులు..

Corona

Corona

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగతూ వస్తున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగడంతో భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే అక్కడి సర్కార్‌ కఠిన నిబంధనలు అమలు చేసి కరనో కట్టడికి పాటుపడింది. అయితే.. ఇప్పటికే భారత్‌లో థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా గడిచిన 24 గంటల్లో.. 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 12,249 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా… 38 మంది మృతి చెందారు.

ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Exit mobile version