NTV Telugu Site icon

India Growth: భారత వృద్ధి 8 శాతం పైమాటే.. ఆర్బీఐ కథనం..

Rbi

Rbi

India Growth: ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉంటే భారత్ మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూడా ఇదే విషయాన్ని చెప్పింది. భారతదేశం 8 శాతం వార్షిక జీడీపీ వృద్ధిని కొనసాగించగలదని సెంట్రల్ బ్యాంక్ మార్చి బులెటిన్‌లో ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ కథనంలో పేర్కొంది. 2021-24 కాలంలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి సగటున 8 శాతం కంటే ఎక్కువగా ఉంది.

Read Also: Pallavi Prasanth : శివాజీకి గురుదక్షిణ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్నా ఏంటి ఇలా ఝలక్ ఇచ్చావు..

గ్లోబల్ ఎకానమీ తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోందని, రాబోయే కాలంలో మరింత మందగించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రాసిన కథనం తెలిపింది. దేశంలో 2023-24 అక్టోబర్-డిసెంబర్ కాలంలో రియల్ జీడీపీ గ్రోత్ ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకుంది. పరోక్ష పన్నులు, తక్కువ సబ్సిడీలు కారణంగా ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందని కథనం పేర్కొంది. నిర్మాణాత్మక డిమాండ్, హెల్దీ కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీటలు ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచంలో పలు ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నాయని, అందుకు విరుద్ధంగా భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని పేర్కొంది. పెట్టుబడిదారులు భారత్‌పై ఆసక్తి చూపిస్తుండటంతో మూలధన ప్రవాహం దేశంలోకి పెరిగింది. సాంకేతికత మరింత పోటీతత్వం మరియు సమర్థవంతమైనదిగా మారడం ద్వారా కొత్త వృద్ధి అవకాశాలను అందిస్తోందని రచయితలు తెలిపారు.