Site icon NTV Telugu

Chidambaram: ఇండియా కూటమిపై చిదంబరం హాట్ కామెంట్స్.. బీజేపీపై ప్రశంసలు

Chidambaram

Chidambaram

ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమికి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదని.. బీజేపీ మాత్రం బలంగా ఉందని కొనియాడారు. సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘‘కాంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్’’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిదంబరం పాల్గొని మాట్లాడారు.

ఇది కూడా చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!

ఇండియా కూటమి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందో లేదో తనకు కచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప్రతి విభాగంలోనూ బలంగా ఉందని చెప్పారు. ఒకవేళ ఇండియా కూటమి చెక్కుచెదరకుండా ఉంటే తాను చాలా సంతోషిస్తానన్నారు. 2029 నాటికైనా కూటమి పుంజుకుంటుందేమో చూడాలన్నారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నాను.. బీజేపీ మాత్రం అంత్యంత బలంగా ఉందన్న మాట వాస్తవమన్నారు. ఇలాంటి పార్టీ మరొకటి లేదన్నారు. అన్ని యంత్రాంగాలను బీజేపీ నియంత్రిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అనుమతించబడినంత వరకు ఒక బలీయమైన యంత్రాంగమేనని పేర్కొన్నారు. 2029 ఎన్నికలు మాత్రం చాలా కీలకమైన ఎన్నికలు అని తెలిపారు.

ఇది కూడా చదవండి: JK Encounters: 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం.. సైన్యం వెల్లడి

చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ సన్నిహితులకు పార్టీకి భవిష్యత్తు లేదని తెలుసునని అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమి నేతలు బాగానే ఉన్నారు. ఎన్నికలు ముగిశాక.. ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు కలిసి పని చేయలేదు. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కలిసి ఉంటారా? లేదా? అన్నది తెలియాలి.

Exit mobile version