NTV Telugu Site icon

INDIA bloc: ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభంజనం.. కూటమికి 10, బీజేపీకి 02..

India Bloc

India Bloc

INDIA bloc: ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 02 సీట్లకు మాత్రమే పరిమితమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ మరియు తమిళనాడులోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉపఎన్నికలు జరగగా, ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి.

పంజాబ్ జలంధర్ వెస్ట్ నుంచి ఆప్‌కి చెందిన మోహిందర్ భగత్ విజయం సాధించారు. బెంగాల్‌లో నాలుగు స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గెలుచుకుంది. ఈ స్థానాల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. తమిళనాడులోని విక్రవాండిలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ గెలుపొందారు.

Read Also: IND vs ZIM: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. బౌలర్ ఎంట్రీ

ఇక హిమాచల్ ప్రదేశ్‌లో 03 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేష్‌ ఠాకూర్‌ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి బీజేపీ కంచుకోట డెహ్రా నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో నలాగడ్‌లో కాంగ్రెస్ గెలవగా, హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్‌, మంగ్లూర్ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మంగ్లూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీ మహ్మద్ నిజాముద్దీన్, బీజేపీ అభ్యర్థి ఖటార్ సింగ్ భదానాపై కేవలం 400 ఓట్ల తేడాతో గెలిచారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వార్‌లో బీజేపీ అభ్యర్థి కమలేష్‌ ప్రతాప్‌ షాహి విజయం సాధించారు. బీహార్ రూపాలీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు.