Site icon NTV Telugu

Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్

Cec

Cec

దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్‌గాంధీ చూపించారు. దీనికి కౌంటర్‌గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!

తాజాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్‌ సిబ్బంది

ఇదిలా ఉంటే ఈసీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ బీహార్‌లో యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. తేజస్వి యాదవ్‌తో కలిసి రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్లు దొంగిలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో దాడి తీవ్రతరం చేశారు. దేశమంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగతనం జరుగుతుందని స్వరం పెంచారు.

బీహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నాయి. అయితే ప్రజలు ఈసారి  ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.

Exit mobile version