Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన ఇండియా..
- ఎయిర్‌లైన్ మార్కెట్‌లో ఇండియా రికార్డ్..
- ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్..
- తొలి రెండు స్థానాల్లో అమెరికా మరియు చైనా..
- 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic Airline Market: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఈ దశాబ్ధం చివరి నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు భారత విమానయాన రంగం కూడా గత దశాబ్ధకాలంలో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించింది. 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది.
10 ఏళ్ల క్రితం భారత్ దాదాపుగా 8 మిలియన్ల సీట్లతో 5వ డొమెస్టిక్ ఎయిర్ లైన్ మార్కెట్‌గా ఉండేది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉండేవి. అమెరికా, చైనాలు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించింది. బ్రెజిల్, ఇండోనేషియాలను అధిగమించి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంలో మూడో స్థానానికి చేరినట్లు OAG డేటా తెలిపింది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
Read Also: Vedhika: వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు.. ‘యక్షిణి’ కష్టాలు బయటపెట్టిన వేదిక
10 ఏళ్ల సగటు కన్నా భారత్ సీటింగ్ సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది ఏటా 6.9 శాతం పెరుగుతోంది. ప్రస్తుతం 5 దేశీయ మార్కెట్లలో భారత వృద్ధి రేటు అత్యంత వేగంగా సాగుతోందని నివేదిక తెలిపింది. 2014-2024 మధ్య 6.3 శాతం వార్షిక వృద్ధితో చైనా వెనకబడి ఉందని, యూఎస్ఏ, ఇండోనేషియాలో కూడా చాలా తక్కువ వృద్ధి రేటు ఉందని నివేదిక తెలిపింది. OAG రిపోర్టు ప్రకారం.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లో-కాస్ట్ క్యారియర్(LCC) కెపాసిటీ షేర్. ఏప్రిల్ 2024లో LCC భారత్‌లో దేశీయ ఎయిర్‌లైన్ సామర్థ్యం 78.4 శాతం వాటాను కలిగి ఉంది. తొలి 5 దేశాల డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్లో భారత్‌దే అత్యధిక LCC వాటా కలిగి ఉంది.
గత 10 సంవత్సరాలలో, ఇండిగో వారి మార్కెట్ వాటాను దాదాపు రెట్టింపు చేసిందని, 2014లో 32 శాతం సామర్థ్యం నుండి నేడు 62 శాతానికి పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. మిగిలిన మార్కెట్ కేవలం 0.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది, అయితే ఇండిగోలో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని వెల్లడించింది. గతేడాది నవంబర్ 19న ఒక్క రోజే భారత్‌లో విమానయాన సంస్థలు 4,56,910 మంది దేశీయ ప్రయాణికులతో ప్రయాణించాయి. కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్. ఇది కోవడ్ ముందు సగటు కన్నా 7.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!