Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..

  • రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు కొనుగోలు..
  • మే నెలలో 21 శాతం పెరుగుదల..
  • రష్యా చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే 2వ స్థానం.
India Oil Imports

India Oil Imports

Russian Oil: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం ముందుచూపుతో ఇంధన సంక్షోభం నుంచి బయటపడ్డాము. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మే నెలలో, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీంతో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులలో 21 శాతం పెరుగుదల కనిపించింది.

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) తాజా నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ రష్యా నుంచి భారీగా రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. భారత రిఫైనరీలు రష్యా నుంచి సుమారు 5.8 బిలియన్ యూరోల (6.7 బిలియన్ డాలర్ల) విలువైన రష్యన్ చమురును దిగుమమతి చేస్తున్నాయి. మే నెలలో రష్యా నుండి భారతదేశం జరిపిన దిగుమతులలో సుమారు 83 శాతం ముడి చమురు వాటా ఉందని, దీని విలువ 4.8 బిలియన్ యూరోలు అని నివేదిక పేర్కొంది. చమురు ఉత్పత్తులు మరియు బొగ్గు దిగుమతుల విలువ వరుసగా 550 మిలియన్ యూరోలు మరియు 429 మిలియన్ యూరోలుగా ఉంది. లెక్కల ప్రకారం, రష్యా నుంచి ముడి చమురు దిగిమతి 21 శాతం పెరిగింది. మే నెలలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల పరిమాణం నెలవారీగా 8 శాతంపెరిగింది.

×
×
Ad

గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీ రష్యా చమురు అన్‌లోడింగ్ 36 శాతం పెరగగా, జామ్ నగర్ రిఫైనింగ్ కాంప్లెక్స్ సరఫరా 14 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు కూడా రష్యా చమురు కొనుగొళ్లను పెంచుతున్నాయి. న్యూ మంగళూర్ రిఫైనరీలో సరఫరా 13 శాతం, విశాఖపట్నం రిఫైనరీలో 42 శాతం పెరిగాయి. భారత్‌‌తో పాటు టర్కీ, బ్రూనై, జార్జియా దేశాల్లోని రిఫైనరీలు కూడా రష్యా ముడి చమురును శుద్ధి చేసి, ఆంక్షలు విధించిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.