Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
- రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు కొనుగోలు..
- మే నెలలో 21 శాతం పెరుగుదల..
- రష్యా చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే 2వ స్థానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Oil: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం ముందుచూపుతో ఇంధన సంక్షోభం నుంచి బయటపడ్డాము. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మే నెలలో, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీంతో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులలో 21 శాతం పెరుగుదల కనిపించింది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) తాజా నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ రష్యా నుంచి భారీగా రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. భారత రిఫైనరీలు రష్యా నుంచి సుమారు 5.8 బిలియన్ యూరోల (6.7 బిలియన్ డాలర్ల) విలువైన రష్యన్ చమురును దిగుమమతి చేస్తున్నాయి. మే నెలలో రష్యా నుండి భారతదేశం జరిపిన దిగుమతులలో సుమారు 83 శాతం ముడి చమురు వాటా ఉందని, దీని విలువ 4.8 బిలియన్ యూరోలు అని నివేదిక పేర్కొంది. చమురు ఉత్పత్తులు మరియు బొగ్గు దిగుమతుల విలువ వరుసగా 550 మిలియన్ యూరోలు మరియు 429 మిలియన్ యూరోలుగా ఉంది. లెక్కల ప్రకారం, రష్యా నుంచి ముడి చమురు దిగిమతి 21 శాతం పెరిగింది. మే నెలలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల పరిమాణం నెలవారీగా 8 శాతంపెరిగింది.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీ రష్యా చమురు అన్లోడింగ్ 36 శాతం పెరగగా, జామ్ నగర్ రిఫైనింగ్ కాంప్లెక్స్ సరఫరా 14 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు కూడా రష్యా చమురు కొనుగొళ్లను పెంచుతున్నాయి. న్యూ మంగళూర్ రిఫైనరీలో సరఫరా 13 శాతం, విశాఖపట్నం రిఫైనరీలో 42 శాతం పెరిగాయి. భారత్‌తో పాటు టర్కీ, బ్రూనై, జార్జియా దేశాల్లోని రిఫైనరీలు కూడా రష్యా ముడి చమురును శుద్ధి చేసి, ఆంక్షలు విధించిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!