Independence Day 2022: మీకు తెలుసా..? ఇండియాతో పాటు ఆగస్టు 15న స్వాతంత్య్రం జరుపుకునే దేశాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ ఏడాది ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంటిపై భారత మువ్వన్నెల పతాకం ఎగవేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ దేశాలు కూడా వలసవాదం, పరాయి పాలన నుంచి విముక్తి పొందాయి.
Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా.
జపాన్ పాలనలో 35 ఏల్లు పాటు ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్రం వచ్చింది. రెండు కొరియా దేశాలను అమెరికా, దాని మిత్ర దేశాలు జపాన్ పాలన నుంచి విముక్తి చేశాయి. ఆగస్టు 15న జాతీయ విముక్తి దినోత్సవం లేదా గ్వాంగ్ బోక్ జియోల్( కాంతి పునరుద్ధరణ సమయం)గా కొరియా దేశాలు పిలుస్తాయి. కొరియా యుద్ధం తరువాత ఈ రెండు దేశాలు విడిపోయాయి. ఈ యుద్ధం 1950-53 వరకు కొనసాగింది.
లిచెన్ స్టెయిన్
లిచెన్ స్టెయిన్ దేశం కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటుంది. ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఆరో దేశంగా లిచెన్ స్టెయిన్ ఉంది. ఈ రోజును స్టాట్స్ ఫీయర్ ట్యాగ్ అని పిలుస్తుంది. ఈ తేదీని ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ 2 పుట్టిన రోజును కూడా జరుపుకుంటుంది.
బహ్రెయిన్
బహ్రెయిన్ జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వే తరువాా.. ఆగస్ట్15, 1971న బహ్రెయిన్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే ఇక్కడి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రాన్ని ఆగస్టు 15న పొందినప్పటికీ.. ఆ దేశం ఆగస్టు 15 స్వాతంత్య్రం జరుపుకోదు. బహ్రెయిన్ దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీప్ సింహాసనాన్ని అధిరోహించిన రోజున ఏటా డిసెంబర్ 16న జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది.
తాజావార్తలు
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!