Site icon NTV Telugu

Independence Day 2022: మీకు తెలుసా..? ఇండియాతో పాటు ఆగస్టు 15న స్వాతంత్య్రం జరుపుకునే దేశాలు ఇవే..

Indian Independence Day

Indian Independence Day

Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ ఏడాది ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంటిపై భారత మువ్వన్నెల పతాకం ఎగవేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ దేశాలు కూడా వలసవాదం, పరాయి పాలన నుంచి విముక్తి పొందాయి.

Read Also: RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా.

జపాన్ పాలనలో 35 ఏల్లు పాటు ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్రం వచ్చింది. రెండు కొరియా దేశాలను అమెరికా, దాని మిత్ర దేశాలు జపాన్ పాలన నుంచి విముక్తి చేశాయి. ఆగస్టు 15న జాతీయ విముక్తి దినోత్సవం లేదా గ్వాంగ్ బోక్ జియోల్( కాంతి పునరుద్ధరణ సమయం)గా కొరియా దేశాలు పిలుస్తాయి. కొరియా యుద్ధం తరువాత ఈ రెండు దేశాలు విడిపోయాయి.  ఈ యుద్ధం 1950-53 వరకు కొనసాగింది.

లిచెన్ స్టెయిన్

లిచెన్ స్టెయిన్ దేశం కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటుంది. ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఆరో దేశంగా లిచెన్ స్టెయిన్ ఉంది. ఈ రోజును స్టాట్స్ ఫీయర్ ట్యాగ్ అని పిలుస్తుంది. ఈ తేదీని ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ 2 పుట్టిన రోజును కూడా జరుపుకుంటుంది.

బహ్రెయిన్

బహ్రెయిన్ జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వే తరువాా.. ఆగస్ట్15, 1971న బహ్రెయిన్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే ఇక్కడి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రాన్ని ఆగస్టు 15న పొందినప్పటికీ.. ఆ దేశం ఆగస్టు 15 స్వాతంత్య్రం జరుపుకోదు. బహ్రెయిన్ దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీప్ సింహాసనాన్ని అధిరోహించిన రోజున ఏటా డిసెంబర్ 16న జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది.

 

Exit mobile version