NTV Telugu Site icon

Online Medical Appointments: పెరిగిన ఆన్‌లైన్ మెడికల్ అపాయింట్మెట్లు.. ఈ సమస్యలు ఉన్నవారే అధికం..

Online Medical Consultations

Online Medical Consultations

Online Medical Appointments: ఇండియాలో ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు పెరుగుతున్నాయి. 2022లో గతేడాదితో పోలిస్తే మెట్రో నగరాల్లో 75 శాతం ఆన్ లైన్ మెడికల్ అపాయింట్లు పెరిగినట్లు ప్రిస్టిన్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో 87 శాతం పెరిగింది. లైబ్రేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన 11.1 కోట్ల డాక్టర్-పేషెంట్ ఇంటారక్షన్ డేటాను పరిశీలించగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెంట్ కోరుతున్నట్లుగా తేలింది.

Read Also: Turkey Earthquake: అద్భుతం.. శిథిలాల కింద బిడ్డ జననం.. కానీ..

2021తో పోలిస్తే 2022లో 65 శాతం ఎక్కువ మంది మహిళలు ఆన్‌లైన్ అపాయింట్మెట్లను కోరారు. ఇలా ఆన్ లైన్ అపాయింట్మెంట్లు కోరుతున్నవారిలో గ్యాస్ట్రోఎంటరాజీ, ఈఎన్టీ సమస్యలు ఉన్నవారి సంఖ్య 150 శాతం పెరిగింది. చర్మసమస్యలు 125 శాతం, సైకియాట్రీ అండ్ పీడియాట్రిక్ 110 శాతం, గైనకాలజీ విభాగంలో 100 శాతం ఆన్ లైన్ అపాయింట్మెంట్లు పెరిగాయి.

25-45 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా పిల్లలకు లేదా లైంగిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకుంటున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు డయాబెటిస్, బీపీ, కోవిడ్ అనంతర సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలకు, దీర్ఘకాలిక సమస్యలపై ఆల్ లైన్ మెడికల్ సంప్రదింపులను కోరుతున్నారు. పురుషుల్లో వయస్సుతో సంబంధం లేకుండా శృంగార సంబంధిత సమస్యలకు, మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్), గర్భం, ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వంటి వాటిని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.