NTV Telugu Site icon

Manipur Women Video: మణిపూర్‌ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత

Manipur Women Video

Manipur Women Video

Manipur Women Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అనంతరం అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌ అల్లకల్లోలమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలను నగ్నంగా చేసి ఊరిలో తిప్పిన ఘటన యావత్‌ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతోపాటు ఆ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read also: Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!

కేసు విచారణను కూడా రాష్ట్రం బయట చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఈ ఘర్షణలకు కారణమైన మైతీ, కుకీ వర్గాలతోనూ కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోందని.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే ఈ చర్చల ప్రక్రియ తుదిదశలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మణిపుర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతోన్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మైతీ, కుకీ వర్గాల ప్రజలతోపాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణలు మొదలైన మే 3 నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అంచనా. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులకు చెందిన వేల సంఖ్యలో ఆయుధాలను నిరసనకారులు దోచుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలనే సీబీఐకి కేసును అప్పగించినట్టు అధికారులు ప్రకటించారు.