NTV Telugu Site icon

Delhi: కాలుష్య కోరల్లో ఉత్తరాది.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు..

Untitled 7

Untitled 7

Delhi: ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి పాఠశాలలు మూతబడ్డాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివారాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట అవశేషాలను తగలబెడుతున్నారు. దీని కారణంగా ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని సుప్రీం కోర్టు ఆరోపించింది. ప్రతి ఏడాది పంజాబ్‌లో వరిని సాగు చేస్తూ పంట అనంతరం రైతులు పంట వ్యర్ధాన్ని కాల్చేస్తున్నారు. దీనితో పొరుగు రాష్ట్రం అయిన ఢిల్లీ లో వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని.. కానీ దీని పైన అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదని.. పంజాబ్‌లో వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని నిలిపివేసి.. బదులుగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే మార్గాలను ఎందుకు కడుగొనడంలేదు అని నిలదీసింది.

Read also:MLC Jeevan Reddy : ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం.

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మక్కువ చూపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ కోర్టు మరింత బాధ్యతను కేంద్రంపై ఉంచింది. ప్రభుత్వం మినుములను ప్రచారం చేస్తోంది. మరి దానిని ఎందుకు ప్రోత్సహించడం లేదు అని ప్రశ్నించింది. అలానే పండుగ సీజన్‌ లో కూడా పటాకుల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పండుగ సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా గెహ్లాట్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. కాలుష్య నియంత్రణ విషయానికి వస్తే.. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం కేవలం న్యాయస్థానాల కర్తవ్యం అనే తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉందని.. అయితే ఆ అభిప్రాయం తప్పని.. కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి భాద్యత అని.. అందరూ కాలుష్య నియంత్రణ కోసం బాధ్యత వహించాలి అని కోర్టు పేర్కొంది.

Show comments