NTV Telugu Site icon

Rujira Banerjee: దుబాయికి వెళ్లకుండా రుజిరా బెనర్జీని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

Rujira

Rujira

Rujira Banerjee: |పశ్చిమబెంగాల్‌కి చెందిన ఎంపీ భార్య తన పిల్లలతో దుబాయికి వెళ్లాలనుకోగా.. ఎయిర్‌పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈడీ కేసులో తన పేరు ఉన్న నేపథ్యంలో ఎంపీ భార్య అయినప్పటికీ దుబాయ్‌ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని సోమవారం కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే కొద్దిసేపటి వరకు అక్కడే వేచిఉన్న రుజిరా బెనర్జీ అధికారులు ఎంతకు అనుమతి ఇవ్వకపోవడంతో .. చివరకు పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. దుబాయ్‌ వెళ్లడానికి రుజిరా బెనర్జీకి అనుమతి ఇవ్వని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను టీఎంసీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Read also: Crude Oil: రష్యా నుంచి 1.96 మిలియన్ల చమురు దిగుమతి.. రికార్డు సృష్టించిన భారత్

బెంగాల్‌లో జరిగిన కోల్‌(బొగ్గు) మైనింగ్‌ కేసును ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రుచిరా బెనర్జీని సైతం ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. తాజాగా ఈడీ అమెకు సమన్లు జారీ చేసింది. జూన్‌ 8న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుందని.. ఆ కేసులో రుజిరా బెనర్జీ ఇంకా బెయిల్ తీసుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ప్రస్తుతం దేశం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రుజిరా బెనర్జీని సోమవారం విదేశాలకు వెళ్లకుండా నిలిపివేసినట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుజిరా బెనర్జీని ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read also: US: AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన మహిళ.. అక్కడితో ఆగకుండా..!

ఈస్ట్రర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గతేడాది సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో అభిషేక్‌ బెనర్జీ లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. లబ్ధి పొందిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే తనపై వచ్చిన అభియోగాలను ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఖండించిన విషయం తెలిసిందే.