IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న రుతుపవనాలు
- దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇటీవలే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ ఏడాది 3 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినా.. దేశమంతటా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందుతున్నారు.
కేరళలో రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా నాలుగు నెలల పాటు సాగే వర్షాకాలం ప్రారంభమైంది. రుతుపవనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చేరుకున్నాయి. కేరళ తర్వాత.. మణిపూర్, మిజోరం, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే వారంలో ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘జూన్ 6వ తేదీన నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం మొత్తం, వాయువ్య బంగాళాఖాతం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలతో పాటు మిజోరం, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి.’’అని తెలిపింది. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.
- Tags
- IMD
- india
- Monsoon
- Rain Alert
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!