NTV Telugu Site icon

IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

Imdwarning

Imdwarning

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం భారీ వర్షం కురుస్తుందని.. అలాగే హిమపాతం కూడా భారీగా ఉంటుందని తెలిపింది. గురువారం జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇదే మాదిరిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చదవండి: YS Jagan: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌ పర్యటన.. కొనసాగుతున్న ఉత్కంఠ!

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో అస్సాం మరియు పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో నాగాలాండ్ సమీప ప్రాంతంలో తుఫాన్ ఏర్పడనుంది. దీంతో రాబోయే ఏడు రోజుల్లో ఈశాన్య వర్షాల్లో వర్షాలు కురవనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Pooja Hegde : చీరకట్టులో రెట్రో లుక్ లో మెరుస్తోన్న జిగేల్ రాణి