సప్తసాగార దాచే ఎల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీ మారింది శాండిల్ వుడ్ చిన్నది రుక్మిణీ వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు కానీ ఆ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు ప్లాప్ గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుంది.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ అవుదామనుకుంది కానీ ఆ సినిమా ప్లాప్ రుక్మిణి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
Also Read : Pooja Hegde : చీరకట్టులో రెట్రో లుక్ లో మెరుస్తోన్న జిగేల్ రాణి
ఎప్పుడు తీశారో ఎప్పుడు దింపారో తెలియదు లేదు ఆడియన్స్ కు. దీంతో రుక్మిణీ ఫెర్ఫామెన్స్ చూపించడానికి ఏమీ లేకుండా పోయింది. ఇక డౌన్ ఫాల్ అవుతున్న టైంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ ఆమె ఖాతాలో సూపర్ హిట్ వేసి మళ్లీ ట్రాక్ ఎక్కించాడు. కన్నడ ఇండస్ట్రీలో హిట్స్ వస్తుంటే ఆమె మాత్రం పొరుగు పరిశ్రమపై కాన్సట్రేషన్ చేస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఏస్ లో నటిస్తోంది. అంతలో మరో క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. అదే శివకార్తీకేయన్- మురుగుదాస్ కాంబోలో వస్తోన్న మదరాసిలో యాక్ట్ చేస్తోంది. ఇలా రుక్కు ఫెర్మామెన్స్ కు ఫిదా అయిన కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదే కాదు నీల్- తారక్ కాంబోలో వస్తోన్న క్రేజీ ప్రాజెక్టులో ఈ కన్నడ కస్తూరినే హీరోయిన్. మరీ పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఓన్ పరిశ్రమను మర్చిపోతున్నఈ భామ మరో రష్మికలా మారబోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ ఫ్యాన్స్.