IMD Alert: దేశవ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. ఐఎండీ గుజరాత్‌ను ‘ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్’ జోన్‌గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Sri Lankan Navy: 8 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
కాగా, వర్షాల నేపథ్యంలో గుజరాత్‌లోని అన్ని ప్రాథమిక పాఠశాలలను ఇవాళ (మంగళవారం) మూసి వేస్తున్నట్లు విద్యా మంత్రి ప్రఫుల్ పన్షేరియా వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షం కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు చనిపోగా. మరో ఏడుగురు తప్పిపోయారు. అయితే, ఇవాళ ఢిల్లీతో పాటు 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో తుపాను వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొనింది.
Read Also: Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..
ఇక, సముద్రంలో అలలు ఎగసిపడే ఛాన్స్ ఉందని ఐఎండీ సూచనలు జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న 24 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే, తెలంగాణలో వచ్చే ఆరు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
