NTV Telugu Site icon

Monsoon: ఈ ఏడాది సాధారణ సాధారణ వర్షపాతమే.. ఎల్-నినో ప్రభావం ఉందన్న ఐఎండి..

Monsoon Rain Fall

Monsoon Rain Fall

IMD hopeful of normal monsoon in 2023: ఈ ఏడాది రుతుపవనాల గురించి కీలక విషయం చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). 2023లో దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది భారత్ లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఆశిస్తోంది. అయితే భారతదేశంలో రుతుపవన సీజన్ లో ఎల్-నినో ఏర్పడే అవకాశం ఉందని, ఇది వర్షాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. రుతుపవనాల కాలంలోనే సగటున 96 శాతం వర్షపాతం భారత్ లో నమోదు అవుతుంది. ఏప్రిల్ తొలినాళ్లలో ఉండే పరిస్థితులు నైరుతి రుతుపవనాలను అంచనా వేయడానికి ఉపయోగపడ్డాయని ఐఎండీ మంగళవారం తెలిపింది. అయితే ప్రస్తుతం ‘లా-నినా’ పరిస్థితులు భూమధ్య రేఖ, పసిఫిక్ ప్రాంతంలో తటస్థ పరిస్థితులకు మారాయని తెలిపింది.

ఎల్-నినో లేదా ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్ భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరిత ఉష్ణోగ్రతలను వేడెక్కించడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రుతుపవన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతీ రెండు నుంచి ఏడేళ్లలో ఇది సంభవిస్తుంటుంది. రుతుపవన కాలంలో ఎల్-నినో సంభవిస్తే వర్షాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎల్-నినో తీవ్రతను బట్టి వర్షపాత తక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో సగటు వర్షపాతం తగ్గేందుకు కారణం అవుతుంది, వ్యవసాయంపై తీవ్ర పరిస్థితులను చూపడమే కాకుండా కరువు పరిస్థితులకు దారి తీస్తుంది.

Read Also: Stray Dogs Attack: 11 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన వీధి కుక్కలు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. ద్వీపకల్ప భారతదేశంలోని అనేక ప్రాంతాలు మరియు తూర్పు-మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం మరియు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండవచ్చని సూచిస్తుంది. ఇదిలా ఉండగా, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ-మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఒక వేళ ఎల్-నినో మరింత బలపడితే ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సీజన్ రెండో భాగంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని సముద్ర ఉపరిత ఉష్ణోగ్రత భారత రుతుపవన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.