NTV Telugu Site icon

Rajya Sabha: పెద్దల సభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..

Rajya Sabha

Rajya Sabha

పెద్దల సభకు నలుగురు ప్రముఖులను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఆ నలుగురు దక్షిణాది ప్రముఖులు కావడం మరో విశేషం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను, ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉషాను, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజేయంద్రప్రసాద్‌, వీరేంద్ర హెగ్డేను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్‌ చేసింది కేంద్రం.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. వారి ప్రత్యేకతలను.. వారిని ఏ కేటగిరిలో నామినేట్‌ చేసిన విషయాన్ని కూడా తన ట్విట్టర్‌ హ్యాడిల్‌లో విడివిడిగా షేర్‌ చేశారు ప్రధాని మోడీ.. ఇక, వారి ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తంపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు.. అంటూ తెలుగులో విజయేంద్ర ప్రసాద్‌ గురించి ట్వీట్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.