IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Ozone Hole: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా పెరిగిన ఓజోన్ హోల్..
ప్రాథమిక దర్యాప్తులో విద్యార్థి చదువుపై దృష్టిపెట్టలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతనెల ఫిబ్రవరి 14న ఐఐటీ మద్రాస్ లో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కూడా హస్టల్ గదిలో శవమై కనిపించాడు. కోవిడ్ తర్వాత విద్యాసంస్థలో సవాల్ తో కూడుకున్న వాతావరణం ఉందని, క్యాంపస్ లోని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది శ్రేయస్సును మెరుగుపరచడానికి విద్యాసంస్థ ప్రయత్నిస్తోందని ఓ ప్రకటనలో ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఇటీవల ఎన్నికైన విద్యార్థి సంఘం, విద్యాసంస్థ అంతర్గత విచారణ కమిటీలు సంఘటనలను పరిశీలిస్తాయని పేర్కొంది.