పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు. దీంతో ఒక్కసారికి షాక్ అయ్యారు. ముందు రోజు రాత్రి తమతో ఫోన్‌లో మాట్లాడాడని.. చాలా సాధారణంగా ఉన్నాడని వాపోయారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగి పోయిందని కన్నీరు మున్నీరు అయ్యారు.
ఇది కూడా చదవండి: AP: రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ మృతి..
మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని.. ఈ ప్రక్రియను వీడియో తీసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న షాన్ మాలిక్‌గా గుర్తించారు. ఆదివారం అతడిని కలవడానికి వచ్చిన తల్లిదండ్రులకు గదిలో ఉరివేసుకుని కనిపించినట్లు తెలిపారు. పదేపదే కాల్ చేసినా స్పందించకపోవడంతో అతని తల్లిదండ్రులు మరియు ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది హాస్టల్ గది తలుపును బలవంతంగా తెరవవలసి వచ్చిందని అధికారి తెలిపారు. ఆత్మహత్యపై ఇన్‌స్టిట్యూట్ అంతర్గత విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
షాన్ మాలిక్.. విద్యాపరంగా ప్రతిభావంతుడైన విద్యార్థిగా ఇనిస్టిట్యూట్ తెలిపింది. తెలివితేటలు, అంకితభావం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొంది. సంఘటనను గుర్తించిన వెంటనే క్యాంపస్ సెక్యూరిటీ, వైద్య బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. మాలిక్ మరణం వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అధికారులకు సహకరిస్తామని ఇనిస్టిట్యూట్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Game Changer: చిన్నారులతో కలిసి ‘గేమ్ చేంజర్’ మూవీ చూసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు