దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో అధ్యాపకుల వేధింపులు కారణంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటలు రోజురోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: BJP New President: బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ.. ఎంపిక ఎప్పుడంటే..!
తాజాగా ఐఐటీ-బాంబేలో 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి… ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హాగా గుర్తించారు. ఐఐటీ-బాంబేలో సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకు చెందిన పోవై క్యాంపస్‌లోని హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ టెర్రస్‌పై ఉన్న తోటి విద్యార్థి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Golden Shawl: ఆపరేషన్ సింధూర్ విజయానికి అంకితం చేసిన సిరిసిల్ల చేనేత బంగారు శాలువా..
విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంచనా వేస్తు్నారు. పోవై పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య ప్రముఖ విద్యా సంస్థల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళనలు కలిగిస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని తన హాస్టల్ గదిలో నాల్గవ సంవత్సరం చదువువుతున్న బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. ఇలా ఎక్కడో చోట విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు.
