NTV Telugu Site icon

Rajeev Chandrasekhar: “భారత్‌తో యుద్ధానికి దిగితే మీ పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారు”.. కేంద్రమంత్రి మాస్ వార్నింగ్..

Encounter

Encounter

Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్‌లో అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మీ పిల్లల్ని వేరేవాళ్లు పెంచుతారని ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ చేశారు.

కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశ శతృవులను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భారత్ పై యుద్ధానికి వస్తే వారి పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారంటూ హెచ్చరించారు. ‘భారత్ చాలా యుద్ధాలు చూసిందని, భారత్ ఎప్పుడూ యుద్ధం కోరుకోదని, కానీ భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మీ పిల్లల్ని మరొకరు పెంచుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇది న్యూ ఇండియా అని వెనక్కి తగ్గి, బెదిరిపోదని కేంద్రమంత్రి అన్నారు.

Read Also: Kamal Haasan: నన్ను రజినీకాంత్ ని మించిన ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లోనే లేరు…

భారతదేశానికి శతృవులు ఉన్నారు. ఈ శతృవులు భారత దేశాన్ని ఎదగనివ్వద్దని కోరుకుంటలారు. అయితే వారు భారత మిలిటీర ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా, హైటెక్ గా ఉందని, ప్రాణాలు తీసే యంత్రమని, దానితో తప్పు చేయవద్దని, దాన్ని తప్పించుకోవడమే తెలివైందని ఆయన అన్నారు. సైన్యం అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వాడటాన్ని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉగ్రవాదులను ఎలాగైనా హతం చేయాలని భద్రతా బలగాలు కసితో వేట సాగిస్తున్నాయి. అయితే దట్టమైన అడవులు, కొండలు గుహలు ఉగ్రవాదులకు ఆసరాగా మారుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అనంతనాగ్ ఆపరేషన్‌లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ భట్, రైఫిల్‌మెన్ రవికుమార్ రాణా సహా నలుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఇదిలా ఉంటే శనివారం బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.