NTV Telugu Site icon

India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..

India Canada Issue

India Canada Issue

India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించింది.

ఇదిలా ఉంటే ఈ వివాదంలో అమెరికాకు ఎటూ పాలుపోవడం లేదు. రెండు దేశాలు కూడా కీలకమే కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా మాజీ పెంటగాన్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. భారత్ లేదా కెనడాల్లో ఎంచుకోవాల్సి వస్తే, అమెరికా భారత్ కే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కెనడా కన్నా అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని తెలిపారు.

Read Also: India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్‌పై ధ్వజం

కెనడా, భారత్ పై పోరాటానికి దిగడం ‘‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’’ అని ఆయన అన్నారు. ట్రూడో పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు రూబిన్ వెల్లడించారు. భారత్ పై చేసిన ఆరోపణలకు కెనడా వద్ద ఆధారాలు లేవని, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వం ఎందుకు ఆశ్రయిం ఇచ్చిందని ప్రశ్నించారు. హర్దీప్ నిజ్జర్ ఒక ఉగ్రవాది అయినందు వల్ల మేం భారత్ వైపే ఉంటామని అన్నారు.

నిజ్జర్ కేవలం ప్లంబర్ మాత్రమే కాదని, అనేక దాడులకు పాల్పడిన అతని చేతులు రక్తంతో తడిచాయని, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అని అన్నారు. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదని, సీమాంతర ఉగ్రవాదం గురించి అని అన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చైనాను ఎదుర్కొనే విసయంలో భారత్ కీలకమని అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, అతను వెళ్లిపోయిన తర్వాత మేం కెనడాతో మా బంధాన్ని పునరుద్ధరించుకుంటామని వెల్లడించారు.