Site icon NTV Telugu

PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం: ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ మంగళవారం పూనే పర్యటనలో ఉన్నారు. పూనే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్‌ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అయినా.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలే భరించాల్సి ఉంటుందన్నారు. విదేశీ వలసవాదులు పెట్టిన పేర్లను మారుస్తుంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని విమర్శించారు. పరస్పర విశ్వాసం లేనిచోట అభివృద్ధి అసాధ్యమని వ్యాఖ్యానించారు. పూనే పర్యటనలో భాగంగా ‘లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు’ స్వీకరించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కర్ణాటక, రాజస్థాన్‌లలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.

Read also: Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?

‘ఒకవైపు పూనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు.. బెంగళూరులో ప్రస్తుతం ఏం జరుగుతోందో చూస్తున్నాం. బెంగళూరుతోపాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని కర్ణాటక ప్రభుత్వం స్వయంగా అంగీకరించిందని.. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ అప్పులు పెరుగుతున్నాయి. అభివృద్ధి నిలిచిపోయింది. ఏ పార్టీ అయినా.. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే దాని భారం ప్రజలపైనే పడుతుందని రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలనను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు’ స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యాన్ని తిలక్‌ అర్థం చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాట పంథానూ మార్చారు’ అని పేర్కొన్నారు. ఇదే వేదికపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. దేశంలో తొలి సర్జికల్‌ స్ట్రైక్‌ ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని చెప్పారు. శివాజీ మహారాజ్ ఎప్పుడూ ఎవరి భూమినీ లాక్కోలేదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో రెండు శకాలు ఉన్నాయని.. ఒకటి తిలక్‌, రెండోది మహాత్మా గాంధీ శకమని తెలిపారు. ఎన్సీపీలో చీలిక అనంతరం పవార్‌, ప్రధాని మోదీలు సమావేశం కావడం ఇదే మొదటిసారి.

Exit mobile version