NTV Telugu Site icon

PM Modi: రతన్ టాటా బతికి ఉంటే.. ఇది చూసి ఆనందించేవారు..

Modi

Modi

PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్‌క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ‘‘ కొన్ని రోజుల క్రితం మేము భారతదేశ ముద్దుబిడ్డ రతన్ టాటాను కోల్పోయాము, ఈ రోజు అతను జీవించి ఉంటే ఈ ప్రాజెక్టును చూసి చాలా సంతోషించేవారు’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రతన్ టాటా ఎక్కడ ఉన్నా, ఈ ప్రాజెక్టుని చూసి ఆనందిస్తున్నారని చెప్పారు. C295 విమానాల కర్మాగారం న్యూ ఇండియా యొక్క కొత్త పని సంస్కృతికి చిహ్నమని అన్నారు.

Read Also: Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

ఈ ప్రాజెక్టు భారతదేశం-స్పెయిన్ సంబంధాలకు కొత్త దిశను ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారత్-స్పెయిన్ సంబంధాలకు మరిత పటిష్టం చేస్తుందని చెప్పారు. ‘‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’’ మిషన్‌ని ఈ ప్రాజెక్టు శక్తివంతం చేస్తుందని చెప్పారు. నేడు దేశ డిఫెన్ తయారీ ఎకోసిస్టమ్ మరింత ఉన్నతంగా మారిందని చెప్పారు. గత దశాబ్దకాలంగా దేశంలో ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకుందని, భారతదేశంలో శక్తివంతమైన రక్షణ పరిశ్రమ అభివృద్ధికి దారి తీసిందని అన్నారు.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) ఫెసిలిటీలో భారతదేశానికి సైనిక విమాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్ అయిన TAS ద్వారా C-295 విమానాలను తయారీ చేయనున్నారు. ఈ ఫెసిటిలీలో 40 విమానాలను నిర్మించనుండగా.. ఏవియేషన్ బెహెమోత్ ఎయిర్ బేస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. భారత్‌లో 40 విమానాల తయారీకి TASL బాధ్యత వహిస్తుంది. టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అలాగే ప్రైవేట్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తాయి.