Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్ ఏదైనా సాహసం చేస్తే, “చిట్టగాంగ్” భారత్ వశమవుతుంది..

ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్

ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారత్ ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడని, మా ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా!

ఇదిలా ఉంటే, త్రిపుర రాజవంశీకుడు, తిప్రా మోత పార్టీ చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ బంగ్లాదేశ్‌కి హెచ్చరికలు పంపారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న దేబ్బర్మన్ యూనస్‌ని హెచ్చరించారు. గురువారం గోమతి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.

తిప్రాహా ఇండిజీనస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా) చీఫ్ దేబ్బర్మాన్ చాలా కాలంగా స్వదేశీ తిప్రాసా కమ్యూనిటీలను, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్(సీహెచ్‌టీ)ను ఏకం చేసి గ్రేటర్ టిప్రాలాండ్‌ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ‘‘యూనస్ చైనాతో స్నేహం చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని(ఈశాన్య రాష్ట్రాలు) బెదిరిస్తున్నాడు. ఈశాన్య భారతదేశాన్ని తాకే ధైర్యం చేస్తే, బంగ్లాదేశ్ రెండు నిమిషాల్లో చిన్న భాగాలుగా అవుతుంది, గ్రేటర్ టిప్రాలాండ్‌గా మారుతుంది’’అని దేబ్బర్మాన్ అన్నారు. రాజయుగంలో కూడా, నవాబులు మన ఐక్యత కారణంగా త్రిపుర సైన్యాన్ని ఓడించలేదని గుర్తు చేశారు.

Exit mobile version