Site icon NTV Telugu

తాజా పరిశోధన : మిశ్రమ డోసులతో అధిక రక్షణ…

దేశంలో క‌రోనా తీవ్ర‌త మ‌ళ్లీ పెరుగుతున్న‌ది.  వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  తీవ్రత పెరుగుతుండ‌టంతో ఒకే వ్యాక్సిన్ రెండు డోసుల కంటే మిశ్ర‌మ వ్యాక్సిన్ విధానం వ‌ల‌న ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉంటాయి అనే అంశంపై ఐసీఎంఆర్ ప‌రిశోధ‌న నిర్వ‌హించింది.  ఒక డోసు కోవీషీల్డ్‌, మ‌రో డోసు కోవాగ్జిన్ టీకాలు పొందిన వారికి, రెండు డోసులూ ఒకే ర‌కం వ్యాక్సిన్ తీసుకున్న వారిక‌న్నా మెరుగైన రోగ‌నిరోధ‌క ర‌క్ష‌ణ ల‌భిస్తోంద‌ని తేలింది.  ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 98మందిపై అధ్య‌య‌నం జ‌రిపింది ఐసీఎంఆర్‌.  కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ మిశ్ర‌మం సుర‌క్షిత‌మ‌ని ఐసీఎంఆర్ గుర్తించింది.  రెండింటిని తీసుకోవ‌డం వ‌ల‌న ఎలాంటి దుష్ప్ర‌భావాలు లేవ‌ని ఐసీఎంఆర్ పేర్కొన్న‌ది.  

Read: “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అదుర్స్

Exit mobile version