Site icon NTV Telugu

IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..

High Court

High Court

IAS officer’s wife’s rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఈ కేసుని ప్రస్తావిస్తూ.. ఈ కేసులో నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా మగ అధికారికి కేసును కేటాయించడం, తీవ్రమైన ఆరోపణలను తేలికపాటి నిబంధనలతో భర్తీ చేశారని, ఇవే దిగువ స్థాయి కోర్టు నిందితుడికి ప్రైమరీ బెయిల్ ఇవ్వడానికి మార్గం సుగమం చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, కింది కోర్టు నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేసింది.

Read Also: Israel: ఇజ్రాయిల్ అంతటా “హై అలర్ట్”.. హిజ్బుల్లా చీఫ్ మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత..

ఈ అత్యాచారం కేసు జూలై 14-15 తేదీల్లో జరిగింది. నిందితుడు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోకి ప్రవేశించి, తుపాకీ చూపించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారని, తీవ్రమైన నేరం అయినప్పటికీ చిన్న అభియోగాలను మోపారాని పోలీసులపై ఆరోపించారు.

తన ఫిర్యాదుని విత్ డ్రా చేసుకోవాలని నిందితుడి భార్య, కొడుకు ఒత్తిడి చేసినట్లు బాధిత మహిళ పేర్కొంది. నిందితుడు తన ఇంట్లోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీని తీసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లు చెప్పింది. నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లైంగిక వేధింపుల తీవ్రతను తగ్గించిందని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరద్వాజ్ గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించి, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లోగా అన్ని పత్రాలు, కేసు డైరీని డిప్యూటీ కమిషనర్‌కు అందజేయాలని ప్రస్తుత దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణని మహిళా పోలీస్ స్టేషన్ బదీలీ చేశారు.

Exit mobile version