ప్రస్తుతం కాలంలో పెళ్లిళ్లు ఏం రేంజ్‌లో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. గొప్పలకు పోయి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక సామాన్యులైతే కనీసనం లక్షల్లోనైనా చాలా గ్రాండ్‌గా జరిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్. అలాంటిది దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఇద్దరు బ్యూరోక్రాట్లు చాలా సింపుల్‌గా.. ఎలాంటి హంగామా లేకుండా.. ఎలాంటి బ్యాండ్ మేళా లేకుండా.. అలంకరణ.. డీజేలు లేకుండా కేవలం దండలు మార్చుకుని తంతు ముగించేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
మాధవ్ భరద్వాజ్-అదితి వాష్ణ్యే ఇద్దరూ కూడా 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు. ఐఏఎస్ శిక్షణ సమయంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా ముగించేశారు.
రాజస్థాన్‌లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరూ దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉంటామని ప్రమాణం చేయడంతో చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేశారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు, కొద్ది మంది బంధుమిత్రులే హాజరయ్యారు.
మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం అల్వార్‌లో SDM గా పనిచేస్తున్నారు. భార్య అదితి వాష్ణ్యే ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో SDM గా ఉన్నారు. అదితి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వాసి. వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. కేవలం దండలు మార్చుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
