Viral Video: గంగానదిలో దూకిన 70 ఏళ్ల ముసలామె.. ఆశ్చర్యంలో నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. హర్ కీ పౌరీ బ్రిడ్జి దగ్గర గంగానదిలో వందల మంది భక్తులు ప్రతిరోజు స్నానాలు ఆచరించడం సాధారణం. అక్కడ గల ఘాట్‌లో మూడు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కానీ అక్కడ ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అసలు 70 ఏళ్ల ముసలి వాళ్లు అంటే ఎలా ఉంటారు. కృష్ణారామ అంటూ జపాలు చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఓ ముసలామె ఏకంగా గంగానదిలో సాహసం చేయాలనుకుంది. అక్కడ ఉన్నవారు అలా చేయొద్దు అని చెప్పడం వదిలేసి అదిగో అక్కడ దూకండి అంటూ ప్రోత్సహించారు.
ఆ ముసలామె తనను ఎవరైనా ఆపేస్తారేమో అన్నట్లుగా హడావిడిగా వారు చెప్పిన ప్రదేశంలో దూకింది. అనంతరం ఘాట్‌వైపు ఈతకొడుతూ వెళ్లింది. ఈ వీడియోను సర్వోన్నత న్యాయస్థానంలో చత్తీస్‌గఢ్ తరఫున అడ్వొకేట్ జనరల్‌గా పని చేస్తున్న అశోక్ బసోయా ఈ వీడియోను షేర్ చేశారు. అనంతరం అదే వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా కూడా షేర్ చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
“వీడియో చూసి, నేను మొదట షాక్ అయ్యాను, కాని బామ్మ ఈతలో నిష్ణాతురాలిగా మారిపోయింది. ఆమె వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. హర్ కీ పౌరి వంతెనపై నుంచి గంగానదిలోకి దూకి ఈతకు వెళ్లిన ఆమె ధైర్యం, ఉత్సాహం నమ్మశక్యం కాదు. నిజంగా వయసు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆపదు” అంటూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్‌లో వెల్లడించారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. “వావ్ గ్రేట్”, “గంగకు నమస్కారం”, “సూపర్ టాలెంట్”, “అద్భుతం” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
वीडियो देखकर मैं पहले तो चौंक गया पर दादीजी तो माहिर तैराक निकलीं. वे करीब 70 साल की हैं. जिस दिलेरी और उत्साह से उन्होंने हर की पौड़ी पुल से गंगा में छलांग लगाई और तैरते गयीं वह अविश्वसनीय है.
वाकई उम्र आपको कभी भी कुछ भी करने से नहीं रोक सकती. pic.twitter.com/iC1Z9extwN
— Dipanshu Kabra (@ipskabra) June 28, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!