Site icon NTV Telugu

I2U2: నేడు తొలి సమావేశం.. పాల్గొననున్న ప్రధాని మోదీ

I2u2

I2u2

భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్లు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలను ఆదునీకరించడంతో పాటు ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది.

ఐ2యూ2 కూటమిని పశ్చిమాసియా దేశాల క్వాడ్ గా కూడా పిలుస్తారు. నీరు, అంతరిక్షం, శక్తి, రవానా, ఆరోగ్యం, ఆహారం భద్రత వంటి ఆరు రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ఐ2యూ2 ప్రధాన లక్ష్యం. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అక్టోబర్ 18,2021లో విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐ2యూ2 కూటమి ఏర్పడింది. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి ఆంగ్ల అక్షరాలు ‘ఐ’, యూఎస్ఏ, యూఏఈ దేశాల మొదటి అక్షరాలు ‘యూ’లతో ఐ2యూ2 కూటమి పేరును పెట్టారు.

Read Also: COVID 19: కోవిడ్ కల్లోలం.. 20 వేలను దాటిన కేసుల సంఖ్య

పరిశ్రమల్లో మౌళిక సదుపాయాలు, తక్కువ కార్బన్ ఉద్గాలకు సంబంధించి అభివృద్ధి మార్గాలను అన్వేషించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపడచడం, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిచడంలో ప్రైవేటు రంగ మూలధనం, నైపుణ్యాలను సమీకరించాలనే ఉద్దేశంపై ఈ కూటమి ఏర్పడింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ఈ రోజు జరుగుతున్న సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంపై అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు వర్చువల్ గా నాలుగు దేశాల అధినేతల మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది.

Exit mobile version