NTV Telugu Site icon

Lok Sabha Speaker: ఇప్పట్లో లోక్‌సభకు రాను…. అధికార, విపక్షాల తీరుపై స్పీకర్‌ అసంతృప్తి

Lok Sabha Speaker

Lok Sabha Speaker

Lok Sabha Speaker: లోక్‌సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్‌సభకు రానని స్పష్టం చేశారు. మణిపూర్‌ అంశంపై చర్చకు సంబంధించి ఇటు విపక్షాలతోపాటు.. అటు అధికార పక్షం వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మణిపూర్‌ అంశంపై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. అలాగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మణిపూర్‌ అంశంపై స్వల్ప కాలిక చర్చ చేపడతామని.. చర్చకు హోం శాఖ మంత్రి అమిత్‌ సమాధానం ఇస్తారని చెబుతోంది. దీంతో పార్లమెంటు సమావేశాలు స్థంభిస్తున్నాయి. మణిపూర్‌ అంశంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే ఈ వ్యవహారాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారు.

Read also: Baby Movie: బేబీ టీంపై సంచలన ఆరోపణలు.. ఇక నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్!

ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్‌ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్‌ అంశంపై రూల్‌ 267 ప్రకారం సుదీర్ఘ చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి…. ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తుండగా.. రూల్‌ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చతోనే సరిపెడతామని.. చర్చకు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెబుతారని కేంద్రం చెబుతోంది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సక్రమంగా జరగడం లేదు.