Blackmail: బ్లాక్‌మెయిల్, శారీరక హింసను ఎదుర్కొంటున్న మహిళ, ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో జరిగింది. అతడితో సెక్స్ చేస్తున్న సమయంలో, గొంతు కోసి హతమార్చింది. తనను లైంగిక చర్యల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతోనే హత్యకు పాల్పడినట్లు మహిళ వెల్లడించింది. తనకు వేరేమార్గం లేకపోయిందని పోలీసులకు తెలిపింది. మరణించిన వ్యక్తిన ఇక్బాల్‌గా గుర్తించారు. మృతదేహం అతడి ఇంటికి సమీపంలో దొరికిన 2 రోజుల తర్వాత హత్య చేసిన 32 ఏళ్ల మహిళని అరెస్ట్ చేశారు.
Read Also: Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్ట్..
ఇక్బాల్ జరీ జర్దోసీ కళాకారుడు, ఆమె గ్రామంలోకి తిరుగుతున్న సమయంలో అతడితో పరిచయం ఏర్పడినట్లు మహిళ తెలిపింది. ఒకరితో ఒకరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒక రోజు ఇక్బాల్ తనను ఇంట్లో కలవాలని కోరాడని, ఆ తర్వాత బలవంతంగా తనతో సన్నిహితంగా ఉండేలా చేశాడని మహిళ ఆరోపించింది. తన భర్తకు చెబుతా అంటూ బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డాడని, తన వద్ద ఉన్న రికార్డుల్ని భర్తకు ఇస్తానని బెదిరించాడని, తన సంసారాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడని మహిళ ఆరోపించింది.
‘‘తనకు చిన్న పిల్లలు ఉన్నారు, దీంతో భరించలేకపోయాను. శారీరకంగా కలవాలని చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో విసిగిపోయాను. బుధవారం ఇక్బాల్ అతడి భార్యని తల్లిదండ్రుల ఇంట్లో దింపేందుకు వెళ్లాడు. నేను తనని కలవాలని ఫోన్ చేశాను. రాత్రి 8 గంటల ప్రాంతంలో నా భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి పడుకునేలా చేశా. రాత్రి 11.40 గంటలకు తన ఇంటికి రావాలని ఒంటరిగా ఉన్నానని ఇక్బాల్ కోరాడు. నేను అతడి ఇంటికి వెళ్లిన సమయంలో తాను చనిపోవడం లేద చంపడం చేస్తానని అనుకున్నాను. సన్నిహితంగా ఉన్న సమయంలో కత్తితో అతడి గొంతు కోశాను. నా కుటుంబాన్ని రక్షించుకునేందుకు వేరే మార్గం లేక ఇలా చేశాను’’ అని నిందితురాలు చెప్పింది.