NTV Telugu Site icon

Meghalaya BJP Chief Ernest Mawrie: గొడ్డు మాంసంపై మేఘాలయ బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Ernest Mawrie On Beef

Ernest Mawrie On Beef

I Eat Beef Says Meghalaya BJP Chief Ernest Mawrie: గొడ్డు మాంసం (బీఫ్) విషయంలో బీజేపీ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు. బీఫ్‌ని మొత్తానికే బ్యాన్ చేయాలన్నది బీజేపీ నినాదం. అలాంటి బీఫ్‌ని తాను తింటానని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ‘‘నేను గొడ్డు మాంసం తింటాను. ఈ విషయం బీజేపీకి తెలుసు. నేను గొడ్డు మాంసం తినే విషయంపై బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. పార్టీ సభ్యులు ఎవరైనా సరే, బీఫ్ తింటే ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అసలు పార్టీలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని షాకిచ్చారు. తమ బీజేపీ కులం, మతం గురించి ఆలోచించదని.. మన ఆహారపు అలవాట్లలో గొడ్డు మాంసం తినడం ఒకటని చెప్పారు.

Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తు స్వాహా.. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే

బీజేపీలో ప్రతి ఒక్కరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ కలిగి ఉన్నారని.. దీంతో ఓ రాజకీయ పార్టీకి ఎందుకు ఇబ్బంది ఉండాలి? అని మావ్రీ ప్రశ్నించారు. కేవలం పార్టీలో ఉన్న వారే కాదు.. మేఘాలయలో ఉన్న ప్రతి ఒక్కరూ గొడ్డు మాంసం తింటారన్నారు. బీఫ్ తినే విషయంలో రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు గానీ, నియంత్రణలు గానీ లేవని తేల్చేశారు. గొడ్డు మాంసం తినడం తమ సంస్కృతి అని చెప్పారు. ఇదే సమయంలో.. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను తమ పార్టీ నిలబెడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్‌పీపీ, యూడీపీల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని.. రాబోయే ఎన్నికల్లో కనీసం 34 సీట్లు గెలుస్తామని నమ్మకం వెలిబుచ్చారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరగాలంటే ప్రజలు కచ్చితంగా.. బీజేపీకి ఓటు వేయాలని మావ్రీ కోరారు.

Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్‌-టైమ్‌ ఫిక్స్‌ చెయ్, నేను రెడీ