Supreme Court: తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌కి చెందిన 11 ఏళ్ల అభయ్ సింగ్ అనే బాలుడిని, అతని తల్లి తరుపు బంధువులు హత్య చేశారని తండ్రి కేసు పెట్టాడు. 2013లో బాలుడి తల్లి మరణించడంతో, అప్పటి నుంచి తాత, మేనమామల వద్ద ఉంటున్నాడు. అదనపు కట్నం కోసం బాలుడి తండ్రి, తల్లిని కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మరణంపై పిల్లాడి తాత, అతని తండ్రిపై కేసు పెట్టాడు. పిల్లాడి కస్టడీ కోసం ఇటు తల్లి తరుపువారు, అటు తండ్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే అభయ్ సింగ్ తండ్రి, తన కొడుకును మేనమామలు, తాత చంపాడని పిలిభిత్‌లో కేసు నమోదు చేశారు.
Read Also: Asaduddin Owaisi: బీఆర్ఎస్, కాంగ్రెస్ పెళ్లి పోస్టర్.. బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు..
అయితే ఈ కేసును కొట్టేయాలని పిల్లాడి తల్లి తరుపు కుటుంబం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది, అయితే కోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సుప్రీంలో హత్య విచారణ సమయంలో ‘నేను బతికే ఉన్నాను’అని పిల్లాలు చెప్పాడు. ఈ విషయాన్ని గమనించిన కోర్టు పిలిభిత్ ఎస్పీ, న్యూరియా పోలీస్ స్టేషన్ లోని ఎస్‌హెచ్ఓల నుంచి నివేదిక కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిల్లాడి తాతపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారుల్ని ఆదేశించింది.
ఈ సందర్భంగా.. పిల్లాడు అభయ్ సింగ్ మాట్లాడుతూ.. నేను మా తాతయ్య వద్దే ఉంటున్నాను, పోలీసులు మా ఇంటికి వచ్చి మా తాతను బెదిరిస్తున్నారు. నేను వారితోనే ఉండాలని అనుకుంటున్నాను, అందుకు కేసు మూసేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కట్నం తెవాలని కొట్టడం అభయ్ సింగ్ తండ్రి కొట్టడంతోనే అతని తల్లి మరణించిందని, దీనిపై పిల్లాడి తాత కేసు పెట్టడంతో, తన కుమారుడిని హత్య చేశారని తండ్రి తప్పుడు కేసు పెట్టాడని పిల్లాడి తరుపు న్యాయవాది కుల్దీప్ జౌహరీ తెలిపాడు. దీనిపై జనవరిలో సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.