USA: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..చికాగోలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో తాజా దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
హైదరాబాద్ హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున (సెంట్రల్ స్టాండర్డ్ టైమ్) చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో ముగ్గురు వెంబడించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అతని నుదురు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఫుడ్ ప్యాకెట్లు ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు దాడి చేశారని అతను చెప్పాడు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: UPI Outage:: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం, అనేక బ్యాంక్ సర్వర్లు డౌన్..?
గత వారం, ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనే విద్యార్థి శవమై కనిపించాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, అతను అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. అదే వారం పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య శవమై కనిపించాడు. హర్యానాకు చెందిన వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు.
Hyderabad student was attacked and robbed in Chicago.
Syed Mazahir Ali, a student from #Hyderabad studying at Indiana Wesleyan University in Chicago, was seriously injured in an armed robbery near his home. pic.twitter.com/t3ycvlrqG9
— Sudhakar Udumula (@sudhakarudumula) February 6, 2024
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!