Site icon NTV Telugu

USA: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..చికాగోలో ఘటన..

Hyderabad

Hyderabad

USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో తాజా దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.

హైదరాబాద్ హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున (సెంట్రల్ స్టాండర్డ్ టైమ్) చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో ముగ్గురు వెంబడించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అతని నుదురు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఫుడ్ ప్యాకెట్లు ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు దాడి చేశారని అతను చెప్పాడు.

Read Also: UPI Outage:: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం, అనేక బ్యాంక్ సర్వర్లు డౌన్..?

గత వారం, ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనే విద్యార్థి శవమై కనిపించాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, అతను అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. అదే వారం పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య శవమై కనిపించాడు. హర్యానాకు చెందిన వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు.

Exit mobile version