Site icon NTV Telugu

Punjab: భార్య నిరాకరించడంతో భర్త దారుణం.. ఐదుగురి హత్య

Punjab Incident

Punjab Incident

Husband burned his wife and children alive in punjab: పచ్చని సంసారాన్ని క్షణికావేశం బుగ్గి చేసింది. భార్య, భర్తల మధ్య గొడవ ఐదుగురి మరణాలకు కారణం అయింది. భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ భర్త వద్దకు తిరిగి రావడానికి నిరాకరించడంతో భర్త ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను కూడా క్రూరంగా కాల్చివేశాడు నిందితుడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి భార్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేశాడని పంజాబ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.

పరమ్ జీత్ కౌర్ తన పిల్లలతో కలిసి గత ఐదారు నెలల నుంచి తల్లిదండ్రులతో ఉంటోంది. అయితే భర్త కుల్దీప్ సింగ్ లూథియానాలోని ఖుర్షేడ్ పూర్ గ్రామానికి తిరిగి రావాలని కోరుతున్నాడు. భర్త ఎంతగా బ్రతిమిలాడిన భార్య వినకపోవడంతో దారుణానికి తెగబడ్డాడు. అయితే కుల్దీప్ సింగ్ భార్యతో పాటు పిల్లలను కొట్టేవాడని అందుకే అతనితో వెళ్లేందుకు తను నిరాకరించేదని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే సోమవారం అర్థరాత్రి కుల్దీప్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి నిద్రిస్తున్న ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. భార్య పరమ్ జీత్ కౌర్ తో పాటు ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగిందేరో, 8,5 ఏళ్ల పిల్లలు అర్ష్ దీప్, అన్మోల్ సజీవం దహనం అయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కుల్దీప్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని జలంధర్ రూరల్ ఎస్పీ సత్బ్ జీత్ సింగ్ వెల్లడించారు. నిందితుడిపై హత్యానేరం కేసు నమోదు చేశారు పోలీసులు.

Exit mobile version